Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చే రైళ్లు ఢకొీనకుండా నివారించే 'కవచ్' రక్షణ వ్యవస్థ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైల్వే బోర్డ్ డైరెక్టర్ జనరల్ (భద్రత) రవీందర్ గుప్తా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. సోమవారం వారు దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో 'కవచ్' ప్రాజెక్టు అమలుతీరుపై సికింద్రాబాద్ రైల్ నిలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజినల్ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎమ్‌లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశీయంగా రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ (ఎటిపి) వ్యవస్థ, సిగల్ డిస్ప్లేతో సహా అప్డేట్ అంశాలు, అధిక వేగం నిరోధం, లెవల్ క్రాసింగ్స్ వద్ద ఆటోమెటిక్ విజిల్ శబ్దం రావడం, అత్యవసర సమయాల్లో ఎస్ఓఎస్ సందేశాలు సహా వివిధ భద్రతా అంశాలను వారు సమీక్షించారు. శీతాకాలం దృష్ట్యా ట్రాక్ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకుంటూ, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని వారు అధికారులకు సూచించారు.