Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 400రోజులు, 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో
- 14నెలలు, 4వేల కిలోమీటర్లు
- విలేకర్ల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బుధవారం నుంచి వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర ను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చిందేకు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సోమవారం రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం చేవేళ్లలో ఉదయం 11గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 400రోజులు, 14నెలలు, 4వేల కిలోమీటర్లు, 90 నియోజక వర్గాల్లో ఈ యాత్ర జరిగే విధంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. వైఎస్ సంక్షేమ పాలన ఎజెండాగా, ఈ తరం యువతకు నవతరం నాయకత్వం అనే నినాదంతో యాత్ర సాగబోతున్నదనీ వివరించారు. ప్రతి రోజు రచ్చబండ మాదిరిగా, మాట ముచ్చట కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి నియోజక వర్గంలో మూడు మండలాల్లో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్టు తెలిపారు. తెలంగాణ వచ్చాక ప్రజలు బాగుపడకపోగా, కొందరు మాత్రం తరాలకు సరిపడా ఆస్తులను సంపాదించుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడమే ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రతి మంగళవారం పాదయాత్ర జరిగే చోటనే నిరుద్యోగ నిరాహార దీక్ష సాగుతుందని తెలిపారు.