Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టెలికమ్యూనికేషన్స్ శాఖతో కలిసి తెలంగాణ లైసెన్స్ సర్వీస్ ఏరియా (ఎల్ఎస్ఏ) ''ఇఎంఎఫ్ రేడియేషన్‌పై అవగాహన వెబినార్'' నిర్వహించింది. భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆజాది కా అమ ృత్ మహౌత్సవ్గా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ మహౌత్సవంలో భాగంగా నిర్వహించిన వెబినార్‌ను ఉద్దేశించి, ఏపీ ఎల్ఎస్ఎ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖ సలహాదారు నిజాముల్ మాట్లాడుతూ, ''టెలికమ్యూనికేషన్ అనేది పౌరుల సాధికారతకు కీలక పరికరం, ఒక దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రభావవంతమైన సాధనం. వినియోగదారులకు సాధ్యమైనంత మేర గొప్ప టెలికమ్యూనికేషన్ సేవలను అందించేందుకు టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొబైల్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం అనివార్యమైన అంశం'' అని స్పష్టం చేశారు. ''ఇఎంఎఫ్ రేడియేషన్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి నిర్వహిస్తున్న వెబినార్ అపోహలను తొలగిస్తుంది, మొబైల్ టవర్లు, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉన్న అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగించి, సేవలను, అందరికీ చక్కని నెట్వర్క్ కవరేజ్ అందిస్తుంది'' అని వివరించారు. వెబినార్‌లో తెలంగాణ అదనపు కలెక్టర్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, సాధారణ ప్రజలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల ప్రదాతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏపీ ఎల్ఎస్ఎ, టెలికమ్యూనికేష్స్ శాఖ అధికారి జి.వి.రమణారావు అతిథులకు స్వాగతం పలికారు.