Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకుల దందాకు పాల్పడుతున్నాయని తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల అధ్యాపకుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ విమర్శించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రథమ ర్యాంకు సాధించిన మృదుల్ అగర్వాల్‌ది ఏ కాలేజీ?అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఒకే విద్యార్థి పేరును శ్రీచైతన్య, నారాయణ, ఆకాష్, ఫిట్జీ వంటి విద్యాసంస్థలు ప్రచారం చేసుకోవడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాని ర్యాంకులను వచ్చినట్టు చూపించి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.