Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షులుగా, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షణాధికారి పర్యాద కృష్ణమూర్తికి ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినరు భాస్కర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వినరుభాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్విస్తున్నామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంటే ప్రతిపక్షాలు పదవుల గురించి ఆలోచిస్తున్నాయని విమర్శించారు.