Authorization
Mon Jan 19, 2015 06:51 pm
aనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డు, అదుపులేకుండా పెరుగుతున్న ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఏడేండ్ల బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీలేదని చెప్పారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంలో రవాణా చార్జీలు పెరిగిపోయాయనీ, ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయని చెప్పారు. దేశంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారనీ, వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదని చెప్పారు. అన్ని విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సీఎం కేసీఆర్...పెరుగుతున్న ధరలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.