Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిలబస్ పూర్తిగాక విద్యార్థులు ఇబ్బందులు : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
ఈ నెల 25నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనారిటీ గురుకుల విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించకుండా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రయివేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను సెప్టెంబర్ 1నుంచి తిరిగి ప్రారంభించినా..హైకోర్టు స్టే విధించిందనే కారణంతో సంక్షేమ, గురుకులాల హాస్టళ్లు తెరవలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరు పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో1,700 అతిథి ఆధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆయా పోస్టులను రెన్యూవల్ చేయలేదని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థులకు సిలబస్ పూర్తికాకుండానే వార్షిక పరీక్షలు నిర్వహించడం తగదని సూచించారు. అన్ని సంక్షేమ గరుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఆన్లైన్ తరగతులకు కేవలం 50 శాతం మంది విద్యార్థులే హాజరవుతున్నారనీ, మిగతా సగం మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ రెండో సంవత్సరం చదివే విద్యార్థులకు నెల రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, సిలబస్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.