Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దళితుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పథకం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు రూ.250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.