Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి వెబ్సైట్ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం
- ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ప్రథమ సంవత్సరం పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు హాల్టికెట్లలో వివరాలు, ఫొటో, సంతకం, పేరు, మాధ్యమం, సబ్జెక్టులు వంటి అంశాలను చూసుకోవాలని కోరారు. ఏమైనా తప్పులుంటే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్లు లేదా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారు (డీఐఈవో)ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే ఆ డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. సంతకం లేకపోయినా పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేస్తే ఇంటర్ విద్యార్థులను ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం వేధింపులకు గురిచేసే అవకాశమున్న విషయం తెలిసిందే. అందుకే ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా పరీక్షలుకు రాసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 25 నుంచి వచ్చేనెల 3 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు 4.59.008 మంది విద్యార్థులు రాయనున్నారు.