Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వరంగల్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) కి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్‌లో గత ఐదేండ్లుగా అద్దె భవనంలో నడుస్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అభ్యర్థన పంపిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలోని 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 93ని జారీ చేసింది. ఈ జీవోని ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా, రాజ్యసభ సభ్యుల సురేశ్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్ గుస్తీ జె. నోరియా హైదరాబాద్ లో మంత్రుల నివాసంలో సోమవారం స్వీకరించారు. స్థల ఏర్పాటుకు సహకరించిన పెద్దలకు సొసైటీ ఉపాధ్యాక్షులు నోరియా ధన్యవాదాలు తెలిపారు.