Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊసేలేని కొనుగోలు కేంద్రాలు
- రైతుల ఆందోళన
- ప్రభుత్వం, వ్యవసాయ మంత్రి స్పందించాలని డిమాండ్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకుందామంటే రైతుకు ప్రతి సీజన్లోనూ తిప్పలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల ఏదో ఒక రూపంలో రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ఖరీఫ్ సీజన్ ధాన్యం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరుకుంది. వందల క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు రాశులుగా పోసి ఉంచారు. వాతావరణం అను కూలంగా లేదు. ఎప్పుడు వర్షం వస్తుందో.. ఎలాంటి నష్టం జరుగుతుందోనని ఇటీవల జరిగిన ఘటనలను తలచుకుని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రాశుల కుప్పలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ ఆయకట్టు కింద ఉన్న చాలా గ్రామాల్లో ముందస్తుగా వరి పంట సాగు చేయడంగో పాటు తొందరగానే వరికోతలు మొదలు పెడతారు. అందువల్ల ఖరీఫ్ సాగు ఇప్పటికే చేతికి రావడంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. మెజార్టీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం రాశులకు కాపలాగా ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా డీఆర్డీఏ, మార్కెటింగ్, పీఏసీఎస్ తదితర ప్రభుత్వ సంస్థల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తారు. ఇందులో మెజార్టీ కేంద్రాలను డీఆర్డీఏ పర్య వేక్షణలో మహిళా సంఘాల సభ్యుల చేత కొనుగోలు చేస్తారు. మిగతా మార్కెటింగ్, పీఏసీఎస్ శాఖలు వారి వారి సిబ్బందితోనే కేంద్రాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా సుమారు 250పైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 60శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేయనున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకోసం ముందస్తుగానే విక్రయిస్తే సమస్యలుండవని రైతులు భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం, వ్యవయసాయ మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని రైతుసంఘాలు కోరుతున్నాయి.
దళారుల రంగప్రవేశం
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో దళారులు రంగ ప్రవేశం చేస్తున్నారు. క్వింటాకు రూ.1300 నుంచి రూ.1600 వరకు రైతులు తప్పని పరిస్థితుల్లో వారికి విక్రయిస్తున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో కొంత పంట నష్టపోయిందని, ఉన్న పంటను కూడా నష్టపోకుండా ఉండేందుకు తాము దళారులకు ధాన్యం విక్రయిస్తున్నట్టు పలువురు రైతులు చెబుతున్నారు.
క్వింటాకు రూ.1360 చొప్పున అమ్మిన : గంగరాజు సాయిలు రైతు, వలిగొండ
మూడెకరాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన. క్వింటాకు రూ.1360 చొప్పున ప్రయివేటు వ్యాపారికి అమ్మిన. అంతకంటే ఎక్కువ ధర ఇవ్వలేనని అన్నరు. ప్రభుత్వం ఎప్పుడు కొంటుందో... కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తరో తెలియదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరి సాగు....
జిల్లా సాగు (ఎకరాలు) దిగుబడి అంచనా
సూర్యాపేట 4,69,250 11,26,848 మెట్రిక్ టన్నులు
యాదాద్రి 2,76,000 5.50 లక్షల మెట్రిక్ టన్నులు
నల్లగొండ 4,47,870 11,03,421 మెట్రిక్ టన్నులు