Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు ఆందోళన చెందొద్దు :సీఎం కేసీఆర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గతేడాది మాదిరిగానే ప్రస్తుత వర్షాకాలం కూడా ధాన్యం కొంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6545 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, ఈ క్రమంలో యధావిధిగా ఈ సంవత్సరం కూడా ధాన్యాన్ని సేకరించాలంటూ పౌర సరఫరాల శాఖను సీఎం ఆదేశించారు. సోమవారం ప్రగతిభవన్‌లో ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ శాతం లేకుండా ఎండపోసిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మధ్ధతు ధర ప్రకారం ధాన్యం కొనుగోలు కోసం అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నదని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.