Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుపరిపాలనలో సమర్థ సమాచారానికి కీలక పాత్ర ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రభుత్వ విధానాలు, వినూత్న చర్యల గురించి సకాలంలో, స్థానిక భాషల్లో చేరవేయడం ద్వారా ప్రజలకు సాధికారత కల్పించాల్సిందిగా సమాచార అధికారులకు ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఐఎస్)-2020 బ్యాచ్ అధికారుల బృందంతో మంగళవారం ఆయన సమావేశమ య్యారు.
తాను ఉన్నత పదవులను చేరుకోవడానికి ఉన్నత లక్ష్యం, స్వప్నం, కఠోర శ్రమ, క్రమశిక్షణలే తారక మంత్రంగా ఉపయోగపడ్డాయని యువ సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు.అంతకుముందు పీఐబీ-ఆర్ఓ అబీ, హైదరాబాద్ కార్యాలయ డైరెక్టర్ శృతిపాటిల్, డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్లు ప్రాంతీయ కార్యాలయ సంధాన శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఉప రాష్ట్రపతికి వివరించారు.