Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, నేను కుమ్మక్కయినట్టు మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారనీ, ఇదే అంశంపై చర్చించేందుకు నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేటీఆర్ అన్నింటిలోనూ నాకంటే జూనియర్ అని పేర్కొన్నారు. నేను ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షున్ని, కేటీఆర్ ఒక ప్రాంతీయ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నారు. తాను జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పని చేసి, ఎంపీగా కొనసాగుతున్నట్టు వివరించారు. రాజకీయాలు, పదవులు, పార్టీలు ఎక్కడ చూసినా కేటీఆర్ నాతో సమానం కాదని చెప్పారు. వీటన్నింటిపై తాను చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. ఉప ఎన్నికల్లో నిబంధనలను మంత్రి హరీష్రావు, ఈటల రాజేందర్ తుంగలో తొక్కారని విమర్శించారు. దేశంలోని అన్ని ఎన్నికల కంటే హుజూరుబాద్ ఎన్నిక అత్యంత ఖరీదైనదిగా మార్చారని ఆరోపించారు.సమస్యలే కేంద్రంగా ఎన్నికలు జరగాలి కానీ ఏ సమస్య అక్కడ చర్చకు రావడం లేదన్నారు. పంపకాల్లో వచ్చిన విభేదాలతో ఈటల, హరీష్రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నదని విమర్శించారు.