Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోవిడ్ నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను ఏమేరకు అమలు చేస్తున్నారనే అంశంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనాపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజ శేఖర్ రెడ్డి లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. హుజూరాబాద్ అసెంబ్లీ సీటుకు జరిగే ఉప ఎన్నికల ప్రచారంలో ఎవ్వరూ కోవిడ్ నిబంధనలను అమలు చేయడం లేదనీ, ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారనీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్ లాయర్ వాదించారు. గవర్నమెంట్‌కు 12 మంది వైద్య నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టును అమలు చేస్తున్నామనీ, కేంద్ర గైడ్‌లైన్స్, హైకోర్డు ఆర్డర్లను రాష్ట్రం అమలు చేస్తోందని ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. కోవిడ్ కట్టడికి మాస్క్‌లు పెట్టుకోవాలనే 68 నెంబర్ జీవోను కొట్టేయాలన్న పిల్‌ను కూడా హైకోర్టు విచారించింది. లాయర్ కె.శ్రీకృష్ణ దాఖలు చేసిన పిల్‌ను డివిజన్ బెంచ్ విచారించింది. పిల్‌కు విచారణార్హత ఉందో లేదో తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. మాస్క్ పెట్టుకుంటే కరోనా రాదని వైద్యులు, లేదా ఐసీఎంఆర్ శాస్త్రీయంగా నిరూపించలేదని పిటిషనర్ వాదించారు. విచారణ నవంబర్ 22కి వాయిదా పడింది.