Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల ప్రధానాధికారికి రేవంత్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగ భృతి ఇస్తామనే గత ఎన్నికల హామీ ఏమైందంటూ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును నిరుద్యోగ యువతి నిరోషా ప్రశ్నించడంతో ఆమెపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళి అక్కడ ఆమెను తిట్టారని పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇదే విషయంపై ఆయన ఫిర్యాదు చేశారు.అనంతరం రేవంత్ విలేకర్లతో మాట్లాడుతూ హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి, తాను కుమ్మక్కయినట్టు మంత్రి కేటీఆర్ ఆరోపిస్తున్నారనీ, ఇదే అంశంపై చర్చించేందుకు నవంబర్ 15 లోపు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.