Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే
నవతెలంగాణ - యాదాద్రి
యాదాద్రి పుణ్యక్షేత్రం పున్ణప్రారంభ ముహూర్తాన్ని చినజీయర్‌స్వామి ఖరారు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. తొలుత ఆయన ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించారు. సీఎం మధ్యాహ్నం యాదాద్రి క్షేత్రం వద్దకు చేరుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఈవో గీత, వైటీడీఏ చైర్మెన్ కిషన్‌రావు, సీఎంవో అధికారి భూపాల్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మెన్ ఉప్పలశ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి ఘాట్ రోడ్డు ద్వారా బాలాలయానికి చేరుకున్నారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.అక్కడి నుంచి సీఎం వీఐపీ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారు చేసిన ప్రధానాలయ ద్వారాలను పరిశీలించారు.