Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే ఎన్నికల్లో మోడీ, కేసీఆర్‌కు తగు రీతిలో బుద్ధి చెపుతాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- అట్టహాసంగా పార్టీ ఖమ్మం రూరల్ మండల మహాసభ
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
పాలేరులో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం కోటి అమరయ్య నగర్లో మూడ్ లలితమ్మ, వజ్జా వెంకయ్య ప్రాంగణంలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల 8వ మహాసభ పార్టీ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్ష తన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన జెండాను తమ్మినేని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లా డుతూ.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, మోడీలకు తగు రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. మోడీ దేశ సంపదను పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో 11 నెలలుగా దీక్ష చేస్తున్న రైతులపై కనికరం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎర్రజెండా బలపడుతుందని తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ లు ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేదవాళ్లను నిరుపేదలుగా మార్చడమే బీజేపీ ధ్యేయం అన్నారు. రాబోయే రోజుల్లో మిలిటెంట్ పోరాటాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని కార్యకర్తలకు సూచించారు. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం రూరల్ మండలంలో.. ఎన్ని అవాంతరాలు ఎదురైన మళ్ళీ పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. భవిష్యత్ అంతా ఎర్రజెండాదే అని తెలి పారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లా డుతూ.. కేసీఆర్, మోడీలు మాయమాటలతో ఏడేండ్లు పాలన సాగిం చారనీ, వారి మాయమాటలు ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గ్రామాలే ఉద్యమ కేంద్రాలుగా ఉండాలన్నారు. ఉద్యమాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు. అనంతరం సీపీఐ(ఎం) ఖమ్మం రూరల్ మండల కార్యదర్శిగా నండ్ర ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. మహాసభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.