Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీజేఎంఏ అధ్యక్షులు గౌరి సతీష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను బహిష్కరిస్తున్నామని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరి సతీష్ ప్రకటించారు. కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం లేకుండా హాల్‌టికెట్లు జారీ చేయడం వల్ల పరీక్షా కేంద్రాల్లో తప్పిదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల పరీక్షల్లో గందరగోళం ఎదురయ్యే అవకాశముందని తెలిపారు. అధ్యాపకులు, భవనాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదని వివరించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పరీక్షలను నిర్వహించడం ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. కరోనా ప్రభావంతో లాక్డౌన్లో విద్యారంగం దెబ్బతిన్నదని తెలిపారు. కొన్ని కాలేజీలు మూతపడ్డాయని పేర్కొన్నారు. వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి కోల్పోయి ందని వివరించారు. రెండేండ్ల నుంచి ప్రభుత్వం స్కాలర్షిప్లు, ఫీజు రీయింబ ర్స్మెంట్ రూ.315 కోట్లు మంజూరు చేయలేదని తెలిపారు. విద్యార్థులు, యాజ మాన్యాల ప్రతినిధులు ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. పది నెలలుగా కాలేజీ భవనాలకు అద్దె కట్టలేక, అధ్యాపకులకు సకాలంలో వేతనాలు చెల్లించలేక, కరెంటు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్సులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలనీ, స్కాలర్షిప్లు, ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.