Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీ2బీ ఫెయిర్లో 500కుపైగా బ్రాండ్ల ఆభరణాలు
హైదరాబాద్ : దక్షిణ భారతదేశ ప్రీమియం బీ2బీ జ్యుయలరీ ఎగ్జిబిషన్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), నోవాటెల్లో ప్రారంభమైంది. హైదరాబాద్ జ్యుయలరీ పెర్ల్ అండ్ జెమ్ పెయిర్ 13వ ఎడిషన్ ఇది. ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ అభిలాష బిషత్, ప్రత్యేక అతిధులుగా జారు అలుక్కాస్ జ్యువెలరీ సీఎండీ శ్రీ వర్గీస్ జోస్ అలుక్కాస్, జెమ్ అండ్ జ్యుయలరీ పరిశ్రమ నిపుణురాలు, ఎగ్జిక్యూటివ్ కోచ్ అండ్ స్ట్రాటజిస్ సలహాదారు, లీడర్ షిప్ సర్కిల్ ప్రాక్టీషనర్ నిరుప భట్, హైటెక్ సిటీ జ్యుయలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ మహేంద్ర తాయల్, హైటెక్ సిటీ జ్యుయలరీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీ ముకేశ్ అగర్వాల్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేశ్ ముద్రాస్, ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా మేనేజింగ్ గ్రూప్ డైరెక్టర్ పల్లవి మెహ్రా జ్యువెలరీ పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో ఈ ప్రదర్శనను ప్రారంభించారు.