Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల నుంచి ప్రారంభం
- గడప గడపకు పోతాం.. ప్రజల పక్షాన పోరాడతాం
- సంక్షేమ పాలనే లక్ష్యంగా పాదయాత్ర
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్ఆర్తెలంగాణ పార్టీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల మంగళవారం నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాద యాత్రను చేపట్టనున్నారు. తన తండ్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి 2003లో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించిన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచే షర్మిల కూడా మరోమారు ప్రజా ప్రస్థానం యాత్రను మొదలు పెడుతున్నారు. మంగళవారం ఉదయం 10గంటలకు శంకర్పల్లి క్రాస్ రోడ్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభానంతరం షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలిరోజు 10కిలోమీ టర్ల నడక సాగిస్తారు. 400 రోజులపాటు జరిగే పాదయాత్ర 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4వేల కిలోమీటర్ల మేర సాగనుంది. తిరిగి చేవెళ్లలోనే ముగించాలని పార్టీ నిర్ణయించింది. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి ఆ యాత్రను 3నుంచి సాయంత్రం 6గంటల వరకు పాదయాత్ర కొనసాగుతుంది.ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ ఉంటే అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడతానని షర్మిల వెల్లడించారు. మహాప్రస్థానం ప్రారంభం సందర్భంగా సోమవారం వైఎస్ షర్మిల తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు.a