Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ద్విశతాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించబోయే ప్లీనరీ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. ఆ కార్యక్రమ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ మంగళవారం ఏర్పాట్లను సమీక్షించారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలంటూ ఆదేశించారు.
కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్లు
టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ మంగళవారం తెలంగాణ భవన్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి, పర్యవేక్షణాధికారి పర్యాద కృష్ణమూర్తికి హోం మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షులు ముజీబుద్దీన్ తదితరులు నామినేషన్ దాఖలు చేశారు.
రెండో రోజూ నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశాలు...
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గస్థాయి ప్రతినిధులతో చేపట్టిన సమావేశాలు రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. తెలంగాణ భవన్లో జరిగిన ఈ భేటీల్లో 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యాచరణపై ఆయన మార్గదర్శనం చేశారు.