Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కారు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా అభివృద్ధి కోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. గుజరాత్‌లోని సబర్మతి నదీ అభివృద్ధి మండలి తరహాలో మూసీకి కూడా ఏర్పాటు చేసేలా ఆర్డర్ ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. మూసీ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ లాయర్ చెప్పారు. సబర్మతి నదిని ఏవిధంగా అభివృద్ధి చేశారో గుజరాత్ వెళ్లి అధికారులు తెలుసుకుంటే ఇక్కడ చేసే పనులు మరింత పురోగతి సాధించవచ్చునని చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ సలహా ఇచ్చింది. విచారణ నవంబర్ ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది.