Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30న ఆ నియోజకవర్గ పరిధిలోని కార్మికులకు, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో నెంబర్ 516ని కార్మిక, ఉపాధి కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని బుధవారం జారీ చేశారు. తెలంగాణ ఫ్యాక్టరీస్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు-1974, తెలంగాణ షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు-1988 ప్రకారం సెలవు ఇస్తున్నట్టు తెలిపారు.