Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారిగా చెలరేగిన మంటలు
- అదుపు చేసిన అగ్నిమాపక, ఆస్పత్రి సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఆస్పత్రిలోని ఓల్డ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఉదయం 7:20 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సందర్భంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగి ఈ ఘటన జరిగినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆస్పత్రి అగ్ని ప్రమాద ఘటనపై ఆరా తీశారు. సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం డీఎంఈ రమేశ్‌రెడ్డి ఆస్పత్రిని సందర్శించారు. సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. సాయంత్రానికి సెల్లార్, 4, 8 అంతస్థుల్లో కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.