Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఈనెల 23వ తేదీ అన్ని ప్రభుత్వరంగ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా హైదరాబాద్ సెంట్రల్ కోర్ట్ హౌటల్లో ఈ సమవేశం జరుగుతుందని వివరించారు. అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.