Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. గురువారం (అక్టోబర్ 21) పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరవీరుల సేవలను జాతి ఎన్నటికీ మరువబోదని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు విధి నిర్వహణకు పునరంకితం కావాలని కోరారు. అమరులైన పోలీసుల కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.