Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిజినెస్ గ్రూప్ సమావేశంలో మంత్రి కేటీఆర్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యూరోపియన్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఐటీ శాఖ మంత్రి కె తారకరామారావు వెల్లడించారు. యూరప్, భారతదేశానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులుతో హైదరాబాద్లో బుధవారం యూరోపియన్ బిజినెస్ గ్రూప్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. యూరోపియన్ వ్యాపార వాణిజ్య వర్గాలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతోపాటు ఇక్కడి వ్యాపార అనుకూలతలను వివరించారు. ఇప్పటికే తెలంగాణ తమకు సానుకూల సమాచారం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విధానాలు, అనుమతుల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకత ఉందని బిజినెస్ గ్రూప్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ఐపాస్ విధానంలో ఉన్న ప్రత్యేకతలను వివరించారు. ఇప్పటికే అమెరికా, జపాన్, కొరియా, చైనా, కొరియా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, అనేక యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వ్యాపార అనుకూలతను ఇక్కడి పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలియజేసేందుకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.