Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ది ఇండిస్టియల్ రిలేషన్స్ (తెలంగాణ స్టేట్) రూల్స్-2021 ప్రభుత్వ ఉత్తర్వుల ఆదేశాలను తెలుగు, ఉర్దూ భాషల్లో ముద్రించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, ఎం సాయిబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు కార్మికశాఖ కమిషనర్‌కు లేఖ రాసారు. పై రూల్స్‌ను కేవలం ఆంగ్లభాషలోనే ముద్రించారనీ, రాష్ట్రంలో అధికారభాషగా ఉన్న తెలుగు, ఉర్దూల్లో కోడ్ ఆన్ వేజేస్ (తెలంగాణ) రూల్స్ 2021 ముద్రించాలని కోరారు. ఆంగ్లంలో ముద్రించిన రూల్స్‌పై అభ్యంతరాలను 30 రోజుల్లో రాతపూర్వకంగా తెలపాలని కోరారనీ, తెలుగు, ఉర్దూలో కూడా ముద్రించి, విడుదల చేయాలనీ, అప్పటి నుంచి 30 రోజుల్లో అభ్యంతరాలను ఆహ్వానించాలని చెప్పారు. మాతృభాషలో ఉంటే ఎక్కువ మంది ప్రజలు వాటిని చదివి అర్థం చేసుకొని, అభ్యంతరాలు, సలహాలు, సూచనలు చేయగలరని సూచించారు. తమ విన్నపంపై సానుకూలంగా స్పందించాలని కోరారు.