Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆధారాలతో రుజువైతే చర్యలు తప్పవు : ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్
నవతెలంగాణ-తాండూరు
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో డెలివరీలు కేసులు నమోదు అయ్యాయని తాండూరు జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రవి శంకర్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటల్లో 38 ప్రసవాలు నమోదయ్యాయన్నారు. గతంలో ఒక రోజే 25, 28 వరకు ప్రసవాలు జరిగేవనీ, కానీ మంగళవారం ఒక్క రోజు 38 ప్రసవాలు జరిగాయని తెలిపారు. ఇందులో 24 సాధారణ ప్రసవాలు కాగా, మిగతావి 14 సిజరియేషన్ అయ్యాయని వివరించారు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ షాలినీ, డాక్టర్ శరత్ చంద్ర, డాక్టర్ రోహిణి, డాక్టర్ శాంతి, డాక్టర్ రుబియాలతో వైద్య సిబ్బంది సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.