Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అమరావతిలోని మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయం, పార్టీ నాయకులు ఇండ్లపై దాడులు చేయడం, ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం కరువైందని విమర్శించారు. ఆ రాష్ట్రం ఎటు పోతున్నదో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ కార్యదర్శి జీవి నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంగళవారం జరిగిన దాడిని టీడీపీపై దాడిగా చూడరాదనీ, ప్రజలపై దాడిగా, రాజ్యాంగంపై దాడిగా పరిగణించాలని కోరారు. విమర్శను రాజకీయంగా చూడకుండా విధ్వంసానికి పాల్పడటం దేశచరిత్రతోపాటు ప్రపంచంలోనూ ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగించిన భాష ప్రజలందరికీ తెలిసిందేనని గుర్తు చేశారు.