Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయినా ఎందుకు లబ్దిదారులకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.ఇంద్రసేనారెడ్డి వేసిన పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి, గృహనిర్మాణ సంస్థలు, అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటీసులను పంపింది.తదుపరి విచారణను జనవరి 17కి వాయిదా వేస్తూ చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2014నుంచి 2021 జూన్‌కు 2.91లక్షల ఇండ్లు మంజూరైతే 1.27 రెండు పడకల ఇండ్లను ప్రభుత్వం నిర్మించిందనీ,వాటిలో 12,656గృహాలనే లబ్దిదారులకు ఇచ్చిందనీ, నిర్మాణ ం జరిగినా లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల తలుపులు, కరెంటు సామా న్లు చోరీకి గురవుతున్నాయని పిటిషనర్ వాదించారు. ఇండ్లు కూడా పాడవు తున్నాయనీ, రెండు పడకల ఇండ్ల నిర్మాణానికి రాష్ట్రం రూ.8.74 వేల కోట్లను అప్పు చేసిందనీ, కేంద్రం రూ.1311 కోట్లు ఇచ్చిందని తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.