Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల సమయంలో మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా.. దేశ భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సంగారెడ్డిలోని మగ్దూంనగర్లో కామ్రేడ్ నారాయణ రెడ్డి పేర నిర్మిస్తున్న సీపీఐ కార్యాలయానికి చాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రధాని మోడీ అమ్మేస్తున్నారన్నారు. రక్షణ, రైల్వే రంగాల ప్రయివేటీకరణకు బీజం వేసిన మోడీ.. రైతులను వంచిస్తున్నారని విమర్శించారు. సెంటిమెంట్ రాజకీ యాలకు తెరతీస్తున్న బీజేపీ.. ప్రజలను మోసం చేస్తోం దన్నారు. బీజేపీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. నిత్యావసరాల ధరలు తగ్గించాల్సిందే నన్నారు. పోడు భూముల కోసం వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉమ్మడిపోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ అసైన్డ్ భూము లను అన్యాక్రాంతం చేస్తున్నారని విమర్శించారు. హుజూరా బాద్ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా సాగడం లేదన్నారు. రూ.10 లక్షల దళితబంధు అంటున్న కేసీఆర్.. డబ్బులివ్వకుండా నాటకాలాడుతున్నారన్నారు. బంగారు తెలంగాణకాదు. బతకడమే కష్టంగామారిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజలను వెట్టిచాకిరి నుంచి విముక్తికోసం నారాయణరెడ్డి విశేషంగా కృషిచేశా రని చెప్పారు. ప్రజల పక్షపాతిగా నిలిచిన నారాయణరెడ్డి పేర సీపీఐ కార్యాలయం నిర్మించడం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.