Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంకితభావంతో వత్తిని నిర్వహిస్తూ రోగులకు డాక్టర్లు సేవలు అందిస్తారు. అలాంటి డాక్టర్లను ఘనంగా సత్కరించాలని హై బిజ్ టీవీ సంకల్పించింది. వైద్య రంగంలో అపారమైన సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఇతర ప్రముఖులు, ఆస్పత్రులకు పురస్కారాలను ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 29 విభాగాల్లో ఈ అవార్డులను అందజేయనుంది. హై బిజ్ టీవీ గతంలో పలు విభాగాల్లో అవార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్స్ (2020, 2021), మీడియా అవార్డ్స్ (2021) ఇచ్చింది. వాటి స్పూర్తితో హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్‌కు సైతం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగానే కార్డియాలజీ, సీటీ సర్జరీ, న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, అనెస్థిటిక్స్ కేటగిరీల్లో అవార్డులు ఇవ్వనుంది. అలాగే, నెఫ్రాలజీ, ఇ.ఎన్.టి, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, డయాబెటాలజీ, జనరల్ ఫిజీషియన్, ఎండోక్రినాలజిస్ట్, వ్యాస్కులర్ సర్జరీ, ఆంకాలజీ/ హెమటాలజీ విభాగాల్లో పురస్కారాలను అందజేయనుంది. వీటితో పాటుగా రేడియాలజిస్ట్, సైకాలజిస్ట్, రుమటాలజీ, జనరల్ సర్జరీ, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్, డాక్టర్ పొలిటీషియన్, డాక్టర్ ఆర్టిస్ట్, ఎక్స్ట్రార్డినరీ స్కిల్డ్ డాక్టర్ కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనుంది. వైద్య విభాగంలో ట్రైల్ బ్లేజర్, లెజెండ్స్, లైఫ్ టైమ్ అవార్డులను సింగిల్, మల్టీస్పెషాలిటీ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనుంది. ఈ అవార్డులకు సంబంధించిన విజేతలను డాక్టర్ శ్రీధర్ కస్తూరి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నేతత్వంలోని జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో జరుగుతుంది. వైద్య రంగానికి చెందిన ప్రముఖులు, ఇతర విభాగాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. హై బిజ్ టీవీ హెల్త్ కేర్ అవార్డ్స్ కార్యక్రమ వివరాలు తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హౌటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ కస్తూరి (సన్ షైన్ హాస్పిటల్), డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (స్టార్ హాస్పిటల్), మాడిశెట్టి రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ), కార్తిక్ రౌత్ (డాక్టర్ ట్యుటోరియల్స్) తదితరులు పాల్గొన్నారు.