Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జాతీయ అద్యక్షులు వీపీ సాను
నవతెలంగాణ-జనగామ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీ య నూతన విద్యావిధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం అమలు చేయొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు వీపీ సాను డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లాలోని వైష్ణవి గార్డెన్లో నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలకు విచ్చేసిన ఆయన బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తోంద న్నారు. నీట్ అర్హత పరీక్ష పేపర్లు లీక్ అవుతున్నా కనీసం స్పందన లేదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని ఆరోపిం చారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడంలో కేంద్రానికి ముందు చూపు లేద ని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభు త్వానికి కొమ్ము కాస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభు త్వం జాతీయ విద్యా విధానం పై నోరు మెద పకుండా ఎందుకు మౌనంగా ఉందని విమర్శిం చారు. ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యో గాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రీసర్చ్ స్కాల ర్స్కు తగిన సమయంలో ఫెలోషిప్స్ రాక ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం స్పందించట్లేద న్నారు. ఫీిజు రీయింబర్స్మెంట్ లేక విద్యాసంస్థలు, విద్యారంగం అతలాకుతులమైందన్నారు. ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ప్రభుత్వాలు అనుసరి స్తున్న తీరును తిప్పి కొడుతూ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
అంతకు ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాలను రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి పతాకావిష్కరణ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, జావిద్, మిష్రిన్ సుల్తానియ, అరవింద్, రజనీకాంత్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధర్మ భిక్షం, బోడ నరేందర్, జిల్లా నాయకులు సందీప్, తరుణ్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.