Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్పత్తి నిర్మూలనకు ప్రణాళిక రూపొందించాలి
- లభ్యత పెరగటం శోచనీయం నిరోధానికి పూర్తి సహకారం అందిస్తాం : సీఎం కేసీఆర్
నవతెంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖరరావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్ లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతున్నదంటూ నివేదికలు వస్తున్న నేపథ్యంలో దాని మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటిం చాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాలనీ, ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ''రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగాం. ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలున్నాయి. వారు చేసిన వీరోచిత పోరాటం ఉంది. దీంతో రాష్ట్ర గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగింది. ఒకవైపు రాష్ట్రం గొప్పఅభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయం'' అని అన్నారు.
''ఈపీడను తొందరగా తొలగించకపోతే మనం సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం వుంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నా యనే విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలి. ఎంతో ఆవేదనతో నేను ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశాను.
పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు అందజేసు కుని గంజాయి సేవిస్తున్నారని నివేదికలు వస్తున్నా యంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అమాయకులైన యువకులు తెలిసీ తెలియక వీటి బారిన పడుతున్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. డీ అడిక్షన్ చాలా క్లిష్టమైన, సుదీర్ఘమైన ప్రక్రియ. దీన్ని నిరోధించడానికి మీకేం కావాలన్నా ఏర్పాటు చేయ డానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గంజాయి మాఫీయాను అణచివేయాలి, నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదని'' సిఎం అన్నారు. గంజాయిని నిరోధించ డానికి డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు. ఎన్ ఫోర్స్ మెంట్‌ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఆదేశించారు. విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇంటలిజెన్స్ శాఖలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని చెప్పా రు. గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారు లకు క్యాష్ రివార్డులు, ప్రత్యేక ప్రమోషన్లు, మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సమావేశంలో పాల్గొన్న ఎక్సైజ్, పోలీసు అధికారులు ఆయా జిల్లాల్లో గంజాయి నియంత్రణ కోసం అనుసరిస్తున్న వ్యూహాల్ని ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రా - ఒడిషా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతంలో ఈ గంజాయి ఉత్పత్తి జరుగు తున్నదనీ, అక్కడి నుంచి చింతూరు - భద్రాచలం మీదుగా మన రాష్ట్రంలోకి ప్రవేశించి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతున్నట్టు తెలిపారు. దీన్ని అరికట్టేందుకు ఇతర రాష్ట్రాల పోలీసు, ఎక్సైజ్ శాఖలతో సమన్వయ వ్యవస్థ అవసరమని వివరించారు.
రాష్ట్రంలోకి ఎక్కువశాతం గంజాయి ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నదని ఛత్తీస్ గఢ్‌లో సైతం గంజాయి సాగు, సరఫరా జరుగుతున్నదని వారు ముఖ్యమంత్రికి తెలిపారు. గంజాయిని వినియోగిస్తున్న వారిలో వలస కూలీలు, యువకులు ఎక్కువగా ఉన్నారనీ, ఆటో డ్రైవర్లు, హమాలీలు కూడా ఉన్నారని చెప్పారు. గంజాయి నిర్మూలనపై బలంగా దృష్టి కేంద్రీకరిస్తే, అతి తక్కువ కాలంలోనే మన రాష్ట్రంలో దీని పీడ విరగడ చేయవచ్చని, అందుకోసం కావాల్సిన సూచనలను అధికారులు వివరించారు. ఎక్సైజ్, పోలీసుశాఖలతోపాటు అటవీశాఖ చెక్ పోస్టుల్లో సైతం నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి వినియోగంలో హాట్ స్పాట్లుగా మారిన సెంటర్లను వెంటనే గుర్తించి, నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వైజాగ్ పోలీసులు, మల్కన్‌గిరి పోలీసులతో సమన్వయం చేసుకునే దిశగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్సైజ్, పోలీసుశాఖల సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం ద్వారా గంజాయి నియంత్రణలో ముందడుగు వేశామని సీఎస్ సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
గంజాయి సాగును, రవాణా, వినియోగాన్ని అరికట్టే విషయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కీలకంగా వ్యవహరిం చాలని ఈ సందర్భంగా సీఎం ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసే విధంగా ప్రత్యేకంగా ఆధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డీజీ స్థాయిలో ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని, హైదరాబాద్‌కు గంజాయి రాకుండానే ఆపే విధంగా పటిష్టమైన వ్యూహం అవలంభించాలన్నారు. తమ గ్రామాల్లో గంజాయి సాగు అవుతున్నట్టయితే, ఆయా గ్రామాల సర్పంచ్‌లు సమాచారాన్ని ఎక్సైజ్, పోలీసు శాఖలకు అందించాలని సీఎం కేసీఆర్ సూచించారు. నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడే విధంగా, కేసులు పకడ్బందీగా నమోదు చేయడానికి ప్రత్యేక న్యాయవాదులను నియమించుకోవాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి సూచించారు.
ప్రచార కార్యక్రమాలు
మత్తు పదార్థాల వినియోగంతో వచ్చే అనర్ధాల గురించి, యువతకు తెలిసేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వ హించాలని కేసీఆర్ ఆదేశించారు. గతంలో ఎయిడ్స్ వ్యాధిపై ప్రచారంతోనే ఆమహమ్మారిపై ప్రజల్లోఅవగాహన కల్పిం చాలని తెలిపారు. అదే తరహాలో మత్తు పదార్థాలతో వచ్చే అనర్థాలపై ప్రభావపూరితమైన షార్ట్‌ఫిల్మ్‌లను, డాక్యుమెం టరీలను, సందేశాత్మక ఆడియో, వీడియో అడ్వర్టయిజ్ మెంట్లను రూపొందించే బాధ్యతను సీఎస్ సోమేశ్ కుమార్ కు అప్పగించారు. మాదక ద్రవ్యాల వినియోగం ఎంత ప్రమాదరకమైనదో విద్యార్థి దశ నుంచే తెలిసే విధంగా ప్రత్యేక పాఠాలను రూపొందించి, సిలబస్‌లో చేర్చాలని, అందుకవసరమయ్యే చర్యలు ప్రారంభించాలని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ ను ఆదేశించారు. డ్రగ్స్ దుష్పలితాలను గురించి ప్రతిభావంతంగా నిర్మించే సినిమాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. యువకుల్లో అవగాహన, పరిణతి కలిగించేలా, గొప్ప ప్రభావం చూపించే విధంగా అద్భుతమైన రీతిలో ప్రచార కార్యక్రమాలు కొనసాగాలని సీఎం సూచించారు.
పట్టాల రద్దు.... పరిశీలన
గంజాయి సాగు చేస్తున్నవారికి రైతుబంధు, రైతు బీమా రద్దు చేయడంతోపాటు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌లో సాగు చేసే వారె వరైనా, వారి పట్టాలను కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలి స్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. బుధవారం నాటి ఉన్నతస్థాయి సమావేశంలో వచ్చిన వివరాల ఆధారం గా త్వరలోనే ముఖ్యమైన అధికారులతో మరో సమావేశం నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అందులో పూర్తిస్థాయి వ్యూ హాన్ని ఖరారు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.