Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో తెరాస పార్టీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని రాష్ట్ర మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం జరిగిన తెరాస పార్టీ ప్లీనరీ, విజయ గర్జన సభ ఏర్పాటు సమావేశం లో మెదక్, అందోల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కెసిఆర్ నాయకత్వంలో కార్యకర్తలు గులాబి జెండాను భుజాలపై మోస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మెదక్ నియోజక వర్గంలోని145 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలలో 44 వార్డుల నుండి విజయగర్జనసభకు ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆందోల్ నియోజకవర్గంలోని 200 గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి ప్రజలు తరలి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.