Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య వ్యాఖ్యలు చేశారంటూ... సినీ నటి సమంత రెండు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేశారు. డాక్టర్ సిఎల్ వెంకట్రావుతోపాటు సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి యూట్యూబ్ ఛానళ్లపై కూకట్పల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. అక్కినేని నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు ఛానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని సమంత పిటిషన్లో పేర్కొన్నారు. మీడియా, పత్రికల ద్వారా వారు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా కోర్టు ఆదేశించాలని కోరారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నానని.. పరువు నష్టం ఎంతనేది తర్వాత కోరతానని తెలిపారు. ఇకపై ఎవరూ తనపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని, ప్రసారమైన ఇంటర్వ్యూలను తొలగించేలా ఆదేశించాలని నటి సమంత న్యాయస్థానాన్ని కోరారు.