Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పంటల మార్పిడి మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పప్పు, నూనెగింజల సాగుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. గురువారం హైదరాబాద్‌లోని మినిష్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే మినుములు, ఆముదాలు, నువ్వులు, ఆవాల సాగు పెరిగిందన్నారు. పంటల మార్పిడి, సమగ్ర వ్యవసాయ విధానంపై రైతు వేదికలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు పంటల మార్పిడి కోసం శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. వచ్చే వానాకాలం నాటికి నిర్దేశించిన లక్ష్యమేర క్షేత్రస్థాయిలో ఫామ్‌ఆయిల్ మొక్కలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పత్తికి మద్దతు ధర రూ 6025 వేలు ఉండగా రూ 7వేలకు పైగా ధర పలకడంపై పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.