Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యామంత్రికి టీపీజేఎంఏ హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో నిరుద్యోగ, పట్టభద్రుల ప్రయివేటు జూనియర్ కాలేజీల్లోని సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 25 నుంచి నిర్వహించబోయే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను బహిష్కరిస్తామని తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని గురువారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరి సతీష్ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల హాల్‌టికెట్లపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల సంతకం లేకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు ఈ పరీక్షలకు సహకరించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీజేఎంఏ రాష్ట్ర కార్యదర్శి గౌరు తిరుపతిరెడ్డి, పార్థసారధి, శ్రవణ్‌కుమార్, సుధీర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సుధాకర్‌రెడ్డి, పాండునాయక్, రాజన్ చౌహాన్, ఉస్మాన్‌ఖాన్, ఖాద్రీపాషా తదితరులు పాల్గొన్నారు.