Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికిగాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది.
ఈ మేరకు వర్సిటీ ఉపకులపతి తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పద్యకవితో మొవ్వ వృషాధిపతి రాసిన 'శ్రీ కృష్ణదేవరాయ విజయప్రబంధము', వచన కవితాలో కాంచనపల్లి గోవర్ధన్రాజు రచించిన 'కల ఇంకా మిగిలే ఉంది', బాలసాహిత్యంలో సామలేటి లింగమూర్తి రాసిన 'పాటల పల్లకి', కథానికలో రావులపాటి సీతారాంరావు రచించిన 'ఖాకీకలం', నవలలో గడ్డం మోహన్‌రావు రాసిన 'కొంగవాలు కత్తి', సాహిత్య విమర్శలో కిన్నెర శ్రీదేవి రచించిన 'సీమకథ అస్తిత్వం', నాటకం/నాటికల్లో ఎన్ఎస్ నారాయణబాబు రాసిన 'అశ్శరభ శరభ', అనుమాదంలో కె సజయ రచించిన 'అశుద్ధ భారత్', వచన రచనల విభాగంలో లక్ష్మణరావు పతంగే రాసిన 'హైదరాబాదు నుంచి తెలంగాణ దాక', రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో సమ్మె ఉమాదేవి రచించిన 'రేలపూలు' గ్రంథాలు సాహితీ పురస్కారాలకు ఎంపికయ్యాయని వివరించారు. ఈనెల 29న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.20,116 నగదుతో సత్కరిస్తామని పేర్కొన్నారు.