Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్ఐఎన్ పిల్లలకు మద్దతు
హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేడిస్ క్లబ్ హైదరాబాద్ విభా గం మరోసారి తన సహృదాయాన్ని చాటుకుంది. ముసురంబాగ్లోని పీపుల్ విత్ హియరింగ్ ఇంపైయిర్డ్ నెట్వర్క్ (పిహెచ్ఐఎన్)లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటుగా వినికిడి శక్తి పరీక్షలను నిర్వహించింది. అదే విధంగా మెడికల్ కిట్స్, స్టేషనరీ, బట్టలు, హైజిన్ ఉత్పత్తులు, కోవిడ్ నియంత్రణకు అవసరం అయ్యే ఉత్పత్తులు, అహారాన్ని అందించింది. పిహెచ్ఐఎన్ లాభాపేక్షలేని సంస్థ. వినికిడి లోపం కలిగిన వారికి హైదరాబాద్‌లో రెసిడెన్సీయల్ స్కూల్‌ను నిర్వహిస్తుంది. 2007లో ఏర్పాటు చేసిన ఈ ఎన్‌జిఒ ప్రస్తుతం 100 మంది పిల్లలకు విద్యా, ఆశ్రయం కల్పిస్తుంది. సమాజంలో అర్హులైన వర్గాలకు తాము ఎప్పుడూ సాయం చేస్తామని ఎస్బిఐ లేడీస్ క్లబ్ నిర్వాహకులు నుపూర్ జింగ్రన్ పేర్కొన్నారు. వినికిడి పరీక్ష చేయడం ద్వారా అవసరమైన వారికి హియరింగ్ మిషన్లను కూడా అందించనున్నామన్నారు.