Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరబాద్
కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తాజాగా భారత్ 100కోట్ల డోసుల పంపిణీ పూర్తి చేసింది. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కేవలం 30శాతం మంది మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ పంపిణీలో ముందున్న చైనాలో మాత్రం ఇప్పటికే దాదాపు 105కోట్ల మందికి (అక్కడి జనాభాలో 75శాతం మందికి) రెండు మోతాదుల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. సింగిల్ డోసు, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి వ్యాక్సిన్ల ఉత్పత్తి, పంపిణిలోనూ తీసుకున్న నిర్లక్ష్య నిర్ణయాలే కారణమని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా నియంత్రణలో వైఫల్యాల కారణంగా సెకండ్ వేవ్ లో కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడం కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవరోధంగా ఏర్పడిందని పేర్కొన్నారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో చేసిన అశాస్త్రీయ ప్రచారాలతో వ్యాక్సిన్ పై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రాలకు ఏర్పడిన వ్యాక్సిన్ల కొరతను పూడ్చడంలో కేంద్రం విఫలమైంది. వ్యాక్సిన్ పంపిణీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉంటుందని.. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని నిపుణులు అభిప్రాయ పడ్డారు. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ను పంపిణీ చేయడంలో ప్రపంచ దేశాలు నిమగమయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సిన్ పంపిణీలో చైనా, భారత్, ఇజ్రాయెల్, అమెరికా, బ్రిటన్ దేశాలు ముందున్నాయనే చెప్పవచ్చు.