Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ
- గోషామహల్ స్టేడియంలో ఘనంగా అమరవీరుల సంస్మరణ దినం
- పోలీసు అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ శ్రద్దాంజలి
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
శాంతి భద్రత ల పరిరక్షణకోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన అమర పోలీసుల త్యాగాలను సమాజంలో ఎవరూ మరువలేరనీ , వారి త్యాగాలు ఎనలేనివని రాష్ట్ర హౌంశాఖమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరిం చుకుని గోషామహల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీసు కవాతులో ఆయన పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విధి నిర్వహణలో ఏడాది కాలంలో 377 మంది పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని విధినిర్వహణలో పోలీసులు పునరంకితం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. గత ఏడాది కాలంలో కరోనా మహమ్మా రిని నిరోధించే క్రమంలో 67 మంది పోలీసులు ప్రాణత్యా గం చేశారనీ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. మావోయిస్టులు , సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులను ఎ దుర్కొవడంలో ఎలాం టి సాహసాన్ని పోలీసులు ప్రదర్శించారో, అదే స్థైర్యాన్ని కరోనాకాలంలో ప్రజలప్రాణాలను కాపాడటానికి కృషిచేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం ఒక్క పోలీసు మాత్రమే విధినిర్వహణలో ప్రాణాలను కోల్పోయా రని ఆయన వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని శాంతి భద్రత ల పరిరక్షణ, నేరాల అదుపులో దేశంలోనే బెస్ట్ పోలీస్‌గా రాష్ట్ర పోలీసులు నిలిచారని ఆయన ప్రశంసించారు. మహిళల రక్షణలో షీ టీమ్‌లను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారని అన్నారు. ప్రజల కోస అనేక త్యాగాలు చేస్తున్న పోలీసులను ప్రజలు మరువరాదని విజ్ఞప్తి చేశారు. పోలీసులకు ప్రభు త్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు కోరుకుంటున్న తీరులో సేవలను అందించడానికి పోలీసులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని కోరారు. ఉగ్ర వాదులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులతో పోరాడిన తీరులోనే కరోనా మహ్మారిని నియంత్రించడంలో సైతం పోలీసులు చేసిన త్యాగాలు ఎనలేనివని ఆయన కొనియా డారు. ప్రజాస్వామ్యంలో తమ రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ ఏర్పడిందనేది ప్రజలు కూడా మరువకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలో నేరాల అదుపు కోసం 15 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందులో 8.5 లక్షల కెమెరాలను ఏర్పాటు చేశామని డీజీపీ వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు, మహిళల భద్రత లక్ష్య సాధనంలో పోలీసుల నిర్విరామ కృషి సాగుతుందని ఆయన తెలిపారు. అంతకు ముందు పోలీసుల అమరవీరుల స్థూపంవద్ద రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్, హౌంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో పాటు ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ డీజీపీలు, పుష్ప మాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీసుల అమరవీరుల సంస్మరణ కవాతు అత్యంత ఆకర్షణీయంగా సాగింది.