Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకవైపు హుజూరాబాద్.. మరోవైపు ప్లీనరీ.. ఇంకోవైపు విజయగర్జన సభ...
- కార్యకర్తల్లో జోష్‌కు టీఆర్ఎస్ ప్రణాళిక
- పార్టీ అధ్యక్ష పదవి కోసం కేసీఆర్ పేరిట ఇప్పటికి 16 సెట్ల నామినేషన్లు
- నేటితో వాటికి తుది గడువు ొ ఉప సంహరణకు 24 మధ్యాహ్నం డెడ్‌లైన్
- ఆ తర్వాత రోజు ప్లీనరీలో అధ్యక్షుడి పేరు ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఏర్పడి... రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో అటు కార్యకర్తల్లోనూ, ఇటు నాయకుల్లోనూ జోష్ నింపేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కా ప్రణాళిక రచించారు. అయితే అనుకోకుండా వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్ని కను కూడా తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు ఆయన వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలో అక్కడ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించేం దుకు వీలుగా ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్ రావును.. రంగంలోకి దించిన గులాబీ దళపతి, వీలు చిక్కినప్పుడల్లా ఆయనతో గ్యాస్ రేట్ల గురించి, పెట్రోల్ధరల గురించీ ప్రస్తావిం పజేస్తూ కమలం పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా వల్ల రెండేండ్లు వాయిదా పడ్డ రాష్ట్ర ప్లీనరీని ఇప్పుడు ఘనంగా నిర్వహించేందుకు (ఈనెల 25న) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏర్పాట్లను పూర్తి చేయిస్తున్నారు. ఇందు కోసం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని మంత్రి సబితా, ఎంపీ రంజిత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు పరిశీలించారు. ఈ ప్లీనరీలోనే పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోనున్న నేప థ్యంలో దానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే పార్టీ ప్రెసిడెంట్‌గా కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ 16సెట్ల నామినేషన్లు దాఖల య్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మెన్లతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు వీటిని దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంట లకు నామినేషన్ల స్వీకరణ గడువు పూర్తవుతుంది. ఈనెల 24 మధ్యాహ్నం మూడు గంటల వరకు వాటిని ఉపసంహరించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకూ కేవలం కేసీఆర్ పేరుతోనే నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో... ఆయన మరోసారి అధ్యక్షుడు కావటం లాంఛనమే. కాకపోతే సంప్రదాయం ప్రకారం వాటిని దాఖలు చేయిస్తున్నట్టు తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు వచ్చే నెల 15న వరంగల్‌లో తెలంగాణ విజయ గర్జన పేరిట భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ప్లాన్ చేసింది. దీనికి కూడా కేటీఆరే ఇన్ఛార్జిగా వ్యవహరి స్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి సంబంధిత ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కేసీఆర్ దాదాపు 16వేల బస్సుల్లో పది లక్షల మందిని తరలించాలని నేతలను ఆదేశించారు. ఈ సభకు ప్రతీ గ్రామం, మండలం, పట్ట ణం, జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆతర్వాత క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్య కర్తల వరకూ అందరికీ శిక్షణా శిబిరాలు నిర్వహించాలని నిర్ణయిం చారు. తద్వారా కాంగ్రెస్, బీజేపీలకు గట్టి సవాల్ విసిరేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇంత ఆర్భాటం, హంగులతో అధికార పార్టీ హడావుడి చేస్తున్నా... కార్యకర్తలు, నాయకుల్లో ఏదో ఒక లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుండటం గమనార్హం. ఇటీవల తెలంగాణ భవన్లో కేటీఆర్ నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షా సమావే శాల సందర్భంగా కొంతమంది నాయకులు... తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు వినికిడి. సర్పంచును, ఎంపీపీ దగ్గరికి రానివ్వడు, ఎంపీపీని, జడ్పీటీసీ పట్టించుకోడు, జడ్పీటీసీల మాటల్ని ఎమ్మెల్యేలు వినరు, ఎమ్మెల్యేల గోడును మంత్రులు వినే పరిస్థితి లేదు... సిచ్యువేషన్ ఇలా ఉంటే మున్ముందు కొంత ఇబ్బందులు తప్పవని వారు వర్కింగ్ ప్రెసిడెంట్‌కు చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఎక్కువ మెజారిటీతో అధికారంలో ఉన్నాం కాబట్టి... ఎవ్వరూ నోరు మెదపరు, కానీ రేపు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ... అసంతృప్తి ఒక్క సారే పెల్లుబుకుతుంది. కాబట్టి ఇలాంటి అంశాలపై దృష్టి సారించా లంటూ వారు కేటీఆర్‌ను కోరినట్టు సమాచారం. దీంతో సంస్థాగ తంగా ఆ పార్టీలో ఉన్న కొద్దిపాటి లోపాలు బయటపడుతున్నాయని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని చక్కదిద్దుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు బీజేపీ పట్ల సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి కూడా నేతల్లో కొంత గందరగోళానికి కారణమవుతున్నదని పలువురి అభిప్రాయం.
ఇక తగ్గేదే లేదు.. కేంద్రంపై జగడమే అంటూ ఇటీవల ఆయన అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే. దీనికి భిన్నంగా కేటీఆర్... బీజేపీని అన్ని విషయాల్లో గుడ్డిగా విమర్శించటం మా విధానం కాదు, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య అనేక సంబంధాలుం టాయి వాటిని మేం గమనంలోకి తీసుకుంటామంటూ తాజాగా చెప్పటం గమనార్హం. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మొదట్లో పోరాడిన టీఆర్ఎస్.. ఆ తర్వాత యూటర్న్ తీసుకోవటం, తెలంగాణకు నష్టదాయకమైన విద్యుత్ సవరణ చట్టాలపై నోరు మెదపకపోవటం కూడా ఈ గందరగోళానికి మరింత ఊతమిస్తున్నది. ఇలాంటి వైఖరులను మార్చుకోవాలంటూ రాజకీయ విశ్లేషకులు గులాబీ పార్టీకి సూచిస్తున్నారు. లేదంటే ప్లీనరీలు, సభలు క్యాడర్లో తాత్కాలికంగా హుషారు నింపినా... శాశ్వతంగా అవి ఒక ప్రత్యా మ్నాయంగా టీఆర్ఎస్ను నిలబెట్టేందుకు ఉపయోగపడబోవని వారు హెచ్చరిస్తున్నారు.