Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి పొన్నాల ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వంద కోట్ల జనాభాకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం గర్వకారణమన్న మోడీ...వంద రోజల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానని హామీ ఇస్తివి ఎందుకు చేయలేదని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మోడీకి '100' నంబర్ అంటే చాలా మక్కువ ఉందనీ, దాన్ని ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి 679 కోట్ల వ్యాక్సిన్ ఇచ్చాయనీ, 130 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో వందకోట్ల డోసులే ఇచ్చారని చెప్పారు. చాలా దేశాలు వందశాతం వ్యాక్సినేషన్ ఇచ్చాయనీ, వంద కోట్ల డోసులిచ్చి ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. మోడీకి సీఎం కేసీఆర్ వంతపడటం సిగ్గుచేటన్నారు.