Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళల రక్షణలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్ మిథాలి నగర్లో సఖీ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకుంటున్నాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ఏం చేయడానికి అయినా ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. ఇటీవల గంజాయి నిర్ములన కోసం సీఎం సమీక్ష చేసి చర్యలకు ఆదేశించారని గుర్తుచేశారు. అక్కడక్కడా చిన్న సంఘటనలు జరుగుతున్నాయనీ,...మహిళల భద్రత కోసం పొలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. కొన్ని సఖీ సెంటర్లు ప్రయివేటు భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.