Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వత్తిదారుడి ఇల్లు దగ్దం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అధికారుల నిర్లక్ష్యం వల్లనే షాట్ సర్క్యూట్ జరిగిందనీ, రజకవృత్తిదారుడి ఇల్లు పూర్తిగా దగ్దమైందని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మీటరు బిగించి ఎర్త్ పెట్టకపోవటంతో ఈ ఘటన జరిగినట్టు ఆయన పేర్కొన్నారు. ఇల్లు మొత్తం కాలిపోయిందని తెలిపారు. రజక వృత్తిదారుడు వెంకటేశ్‌కు రూ.5లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కోనాయిపల్లి గ్రామంలో వెంకటేష్ అనే నిరుపేద రజక వృత్తిదారుడు ఇటీవల ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ఉచిత విద్యుత్తు లబ్ధిదారులందరికీ రూ:5 లక్షల బీమా పథకం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో వత్తిదారుల సంఘం డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. ఆరు నెలలవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు భీమా పథకం ప్రవేశ పెట్టకపోవడంతో వృత్తిదారులకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు.