Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థుల్లో ఒత్తిడిని నియంత్రించేందుకు ఇంటర్ బోర్డు సైకాలస్టులతోపాటు క్లినికల్ సైక్రియాట్రిస్టులను నియమించింది. విద్యార్థులు వారి సహాయాన్ని, సలహాలను తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి, పరీక్షల భయం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న ఇంటర్ విద్యార్థులకు క్లినికల్ సైకాలజిస్టుల సహాయాన్ని అందించే ప్రయత్నానికి కొనసాగింపుగా, ఇంటర్ బోర్డు నిపుణులైన క్లినికల్ సైకియాట్రిస్ట్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. డాక్టర్ అనితి ఆరే 9154951704, డాక్టర్ మేజర్ అలీ 9154951977, రజనీ తెనాలి 9154951695, పి జవహర్లాల్ నెహ్రూ 9154951699, ఎస్ శ్రీలత 9154951703, శైలజ పిశాపాటి 9154951706, అనుపమ 9154951687 నెంబర్లను సంప్రదించాలని కోరారు.