Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 కేంద్రాలు ఏర్పాటు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం జరిగే పీఈసెట్ రాతపరీక్ష శనివారం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఈ మేరకు పీఈసెట్ కన్వీనర్ వి సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫిజికల్ టెస్టుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 5,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 4,479 మంది అభ్యర్థులు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. వారిలో బీపీఈడీలో 2,624 మంది, డీపీఈడీలో 1,855 మంది ఉన్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.